CJP: సీజేపీకి బిగ్ షాక్.. దీప్కే, దాస్, రాంకాలకు లుకౌట్ నోటీసులు!

  • సీజేపీకి బిగ్ షాక్..
  • శివాజీ పార్క్ నిరసనల నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ..
  • అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ముంబై పోలీసుల నోటీసులు..
Cjp

Cjp

CJP: ముంబైలోని శివాజీ పార్కులో పోలీసుల అనుమతి లేకుండా నిరసన చేపట్టిన కేసులో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈ కేసులో సీజేపీ నాయకులు అభిజిద్ దీప్కే, అశుతోష్ రాంకాలపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేుశారు. సీజేపీ కో-కన్వీనర్‌గా ఉన్న సౌరవ్ దాస్‌లపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో సీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ సీజేపీ ఈ నిరసనను చేపట్టింది. దీంతో శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది. నిరసన నిర్వాహకులతో పాటు 400 నుంచి 500 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చబడ్డారు. చట్టవిరుద్ధంగా గుమిగూడటం, ప్రభుత్వ అధికారి ఆదేశాలను ధిక్కరించడం వంటి అభియోగాల కింద భారత శిక్షాస్మృతిలోని 189, 223 సెక్షన్లతో పాటు మహారాష్ట్ర పోలీస్ చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.

ఈ కేసులో భాగంగానే సీజేపీ చీఫ్, కో-కన్వీనర్ అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకాలపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి ముందు సౌరవ్ దాస్ యూకే పర్యటన కోసం వెళ్తున్న క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు అతడిని అడ్డుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించే ప్యానెల్ చర్చకు తనను ఆహ్వానించారని అతను తెలిపాడు. ఎయిర్‌పోర్ట్ చేరుకున్న తర్వాతే లుకౌట్ నోటీసులు ఉన్న విషయం తెలిసిందని చెప్పారు.

ముంబై పోలీసులు అభ్యర్థన మేరకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సౌరవ్ దాస్ విద్య, చిరునామా, తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన సమాచారంలో తేడాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అంశాల ఆధారంగా అతడి భారత పౌరసత్వంపై ప్రశ్నలు వస్తున్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు.