NTV Telugu Site icon

Mumbai Metro: ముంబై మెట్రో సరికొత్త రికార్డు.. దేంట్లో అంటే..!

Mumbaimetro

Mumbaimetro

ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో రైలు సరికొత్త రికార్డు నమోదు చేసింది. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డు నమోదు చేసింది. మంగళవారం ఒక్కరోజే 5,00,385 మంది ప్రయాణికులతో రికార్డు సృష్టించింది. ఘట్కోపర్-అంధేరి-వెర్సోవా మార్గంలో కార్యకలాపాలు ప్రారంభమైన పదేళ్ల తర్వాత ఈ చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే 5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన రికార్డును సాధించింది. ఆగస్టు 13, 2024న ముంబై మెట్రో వన్‌లో 5,00,385 మంది ప్రయాణికులు ప్రయాణించారని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌కు ముందు ఉన్న ప్రయాణికుల సంఖ్యను అధిగమించిందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Karnataka: సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం.. ఎస్‌బీఐ, పీఎన్‌బీ లావాదేవీలు నిలిపివేత

జనవరి 8 నుండి 16 జనవరి 2019 వరకు 9 రోజుల పాటు సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోయాయి. అప్పుడు ఒకరోజు 5 లక్షల దాటిందని.. ఇప్పుడు ఆ సంఖ్యను అధిగమించిందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి అని మెట్రో సంస్థ తెలిపింది. ముంబై మెట్రో వన్‌లో ప్రస్తుతం 430 ట్రిప్పులను నడుపుతోంది. పీక్ అవర్స్‌లో 3.5 నిమిషాల సర్వీస్ ఫ్రీక్వెన్సీ మరియు ఆఫ్-పీక్ అవర్స్‌లో 7 నిమిషాలకు సర్వీస్ నడుస్తోంది. ముంబై మెట్రో వన్‌ను రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మద్దతుతో మెట్రో వన్ ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.

ఇది కూడా చదవండి: Abhishek Manu Singhvi : తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ మను సింఘ్వీ