NTV Telugu Site icon

Amazon: రూ. 55,000 మొబైల్ ఫోన్ ఆర్డర్.. పార్సిల్ తెరిచి చూస్తే షాక్..

Amazon

Amazon

Amazon: ఆన్‌లైన్‌లో బ్రాండ్ న్యూ మొబైల్ ఆర్డర్ చేస్తే, అరడజన్ టీ కప్పుల్ని డెలివరీ చేశారంటూ ఆరోపిస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) అండర్‌టేకింగ్‌లో డిప్యూటీ ఇంజనీర్ అయిన అమర్ చవాన్, అమెజాన్‌లో రూ. 54,999 విలువైన టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ మొబైల్ ఫోన్‌ని ఆర్డర్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం జూలై 13న ఆన్‌లైన్‌లో డబ్బులు పూర్తిగా చెల్లించినట్లు పేర్కొన్నాడు.

Read Also: Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. 10 విమానాల దారి మళ్లింపు

రెండు రోజుల తర్వాత పార్సిల్ వచ్చిందని, దాన్ని ఓపెన్ చేసి చూడగా ఆరు టీ కప్పులు కనిపించడంతో షాక్‌కి గురైనట్లు ఫిర్యాదులో తెలిపాడు. ఈ విషయంపై తాను అమెజాన్‌ని సంప్రదించానని, అయితే వారి నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని వెల్లడించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అమెజాన్‌ అధికారులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని మాహిమ్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటపై ఇప్పటి వరకు అమెజాన్ నుంచి ఎలాంటి వ్యాఖ్యల రాలేదు.