Kissing: బ్యాంకు మహిళా ఉద్యోగిపై అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు రూ. 1000 జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది కఠిన జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ముంబైలోని బోరివలిలో జరిగింది. 2020లో అధికారిక చిరునామాను ధ్రువీకరించేందుకు నిందితుడి నివాసానికి వచ్చిన, మహిళా ఉద్యోగిని పట్ల 54 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు.
Read Also: Hyderabad: భర్తను చంపేందుకు భార్య స్కెచ్.. బీర్ బాటిల్స్ తో దాడి.. చనిపోయాడనుకొని..
నరేంద్ర రఘునాథ్ సగ్వేకర్ అనే వ్యక్తి 2020 నవంబర్ 27న అడ్రస్ వెరిఫై చేయడానికి అతడి ఇంటికి వచ్చిన మహిళా బ్యాంకు ఉద్యోగి పట్ల అవమానకరంగా ప్రవర్తించినట్లు కోర్టు తేల్చింది. BL బ్యాంక్ మలాద్ (వెస్ట్) బ్రాంచ్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆ అధికారి, సగ్వేకర్ కొత్త ఖాతా తెరవడానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత, సాధారణ ప్రక్రియలో భాగంగా అతని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో సగ్వేకర్, మహిళా ఉద్యోగిని పట్టుకుని ఆమె చెంపపై, మెడపై ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను అనుచితంగా తాకాడు.
ఆమె అక్కడి నుంచి బ్యాంకుకు చేరుకుని, విషయాన్ని మేనేజర్, ఇతర సిబ్బందికి తెలియజేసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, విచారణలో మహిళ వాంగ్మూలంలో తప్పులు ఉన్నాయని, ప్రత్యక్ష సాక్షాలు లేవని సగ్వేకర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బీఎన్ చిక్నే, మహిళ వాదన స్థిరంగా, నమ్మదగిందిగా ఉందని వ్యాఖ్యానించారు. సగ్వేకర్ చర్యల్ని తేలికగా తీసుకోలేమని, అడికి ఒక ఏడాది కఠిన జైలు శిక్ష, రూ. 1000 జరిమానాగా విధించింది.
