NTV Telugu Site icon

Mumbai: బద్లాపూర్‌ రైల్వేస్టేషన్‌లో కాల్పులు.. ఒకరికి గాయాలు

Mumbaifiring

Mumbaifiring

మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వేస్టేషన్‌లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లాట్‌ఫామ్-1పై ఒకరు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Paralympics 2024: భారత్కు మరో పతకం.. కాంస్యం సాధించిన కపిల్ పర్మార్

థానే జిల్లాలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో గురువారం సాయంత్రం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు త్వరగా లొంగదీసుకుని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రైల్వే) సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కాల్పులు వెనుక ఏం జరిగింది? అన్నదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా పాత కక్షలతో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయా? ఇంకెమైనా కారణం ఉందా? అన్న కోణంలో కూపీలాగుతున్నారు.

ఇది కూడా చదవండి: CV Ananda: పోలీసులపై బెంగాల్ గవర్నర్ తీవ్ర విమర్శలు.. నేరస్థులున్నారని వ్యాఖ్య

Show comments