BMW Hit-And-Run Case: ముంబై బీఎండబ్ల్యూ కారుని అతివేగంతో నడుపుతూ మహిళ మరణానికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడైన మిహిర్ షా అరెస్ట్ అయ్యాడు. మద్యం తాగి 45 ఏళ్ల మహిళపైకి కారుని పోనిచ్చాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా ఈ రోజు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మిహిర్ షా, సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో కీలక నేత అయిన రాజేష్ షా కుమారుడు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు ప్రమాదం జరిగిన వెంటనే మిహిర్ పరారీలో ఉన్నాడు.
Read Also: Uttar Pradesh: కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకుని.. లవర్‌లతో జంప్ అయిన 11 మంది వివాహిత మహిళలు..
24 మిహిర్ షా ఏళ్ల వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడపడంతో ప్రమాదం జరిగనట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఘటన జరిగిన సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిషిర్ షా ఈ కేసులో నిందితుడు. ప్రస్తుతం రాజేష్ షా, అతని డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు మిహిర్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో అతను కారులోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం.. మిహిర్ గత రాత్రి జుహూలోని ఓ బార్‌లో మద్యం సేవించినట్లు తెలిసింది. ఇంటికి వెళ్తున్న క్రమంలో డ్రైవర్‌ని లాంగ్ డ్రైవ్ చేయాలని కోరాడని, కారు వర్లీ వచ్చిన తర్వాత కారుని తాను డ్రైవింగ్ చేస్తానని మిహిర్ పట్టుబట్టాడు. స్టీరింగ్ తీసుకున్న తర్వాత, వెంటనే కారు స్కూటర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై వర్లీలోని కోలివాడ ప్రాంతానికి చెందిన కావేరి నక్వా, ఆమె భర్త ప్రదీప్ నక్తా ఉన్నారు. చేపలు అమ్మే వారి సస్సూన్ డాక్‌కి చేపలు తీసుకురావడానికి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా ప్రమాదం జిరగింది. కారు కావేరి నక్వా మీద నుంచి దూసుకెళ్లింది. మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్న క్రమంలో ఆమె మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కి స్వల్పగాయాలయ్యాయి.