Site icon NTV Telugu

MLA Slaps Auto Driver: ఆటో డ్రైవర్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

Untitled Design (3)

Untitled Design (3)

మహారాష్ట్ర రాజధానిలో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే పరాగ్‌ షా ఓ ఆటో డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌ 21న ముంబైలోని ఘట్కోపర్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఘట్కోపర్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రంగా ఉండటంతో, వాటిపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్‌ షా స్థానికులతో కలిసి ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో ఓ ఆటో డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో వెళ్లడాన్ని ఎమ్మెల్యే పరాగ్‌ షా గమనించారు.దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే ఆటో డ్రైవర్‌ను ఆపి నిలదీశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే పరాగ్‌ షా ఆటో డ్రైవర్‌ చెంపపై లాగిపెట్టి కొట్టారు. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

అయితే.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది వేగంగా వైరల్‌ అయ్యింది. ప్రజాప్రతినిధిగా ఉండి ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన నాయకులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version