Site icon NTV Telugu

Tahawwur Rana: ఎన్ఐఏ కస్టడీలో తహవూర్ రాణా.. నేడు ఈ అంశాలపై ప్రశ్నలు

Tahawwurrana

Tahawwurrana

26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను గురువారం ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం పాటియాలా ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా 18 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. శుక్రవారం నుంచి ఏప్రిల్ 29 వరకు రాణాను అధికారులు ప్రశ్నించారు. దాడుల కుట్రదారుడు డేవిడ్ హెడ్లీతో ఉన్న సంబంధాలు, కుట్రకు సంబంధించిన విషయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రాముఖ్యంగా 26/11 కుట్ర, లష్కరే తోయిబా, ఐఎస్ఐ సంబంధాల గురించి రాణాను ప్రశ్నించనున్నారు. ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయం దగ్గర గట్టి భద్రత, కెమెరా నిఘా ఉంచారు.

ఇది కూడా చదవండి: Hanmakonda: చెరువులో దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

2008లో ముంబై ఉగ్రదాడుల్లో తహవూర్ రాణా పాత్రను అధికారులు గుర్తించారు. అనేక సంవత్సరాలు అమెరికా జైల్లో రాణా మగ్గుతున్నాడు. అయితే ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాణాను తమకు అప్పగించాలంటూ ట్రంప్‌ను మోడీ కోరారు. అందుకు ట్రంప్ అంగీకరించారు. ఇక తనను భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో రాణా పిటిషన్ వేశాడు. పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది.

ఇది కూడా చదవండి: Astrology: ఏప్రిల్‌ 11, శుక్రవారం దినఫలాలు

 

Exit mobile version