Mumbai Airport: ప్రపంచంలో బెస్ట్ టాప్ -10 ఎయిర్‌పోర్టుల్లో ముంబై విమానాశ్రయం చోటు దక్కించుకుంది. వరసగా మూడో ఏడాది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) ట్రావెల్ + లీజర్ వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ 2025లో ప్రపంచంలోని టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటిగా ఎంపికైంది. 84.23 రీడర్ స్కోర్‌తో, ఏడాది జాబితాలో చోటు దక్కించుకుంది.
ఈ ఏడాది కూడా ర్యాంకింగ్స్ లో ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల విమానాశ్రయాలు సత్తా చాటాయి. టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు 98.57 రీడర్ స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో సింగపూర్ చాంగీ ఎయిర్ పోర్టు 2వ స్థానంలో, ఖతార్ దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు 3వ స్థానంలో, అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం 4వ స్థానంలో, దుబాయ్ ఎయిర్ పోర్టు 5వ స్థానంలో ఉన్నాయి.
హాంకాంగ్, ఫిన్లాండ్‌లోని హెల్సింకి-వాంటా ఎయిర్‌పోర్ట్, టోక్యో హనెడా ఎయిర్‌పోర్టు, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ ఎయిర్ పోర్టులు వరసగా 6,7,8,10 స్థానాల్లో నిలిచాయి. ముంబై ఎయిర్ పోర్టు 9వ స్థానంలో ఉంది. 1900 ఎకరాల్లో, ప్రపంచంలో రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా ముంబై ఎయిర్‌పోర్టుకు పేరుంది. 2024-24 ఆర్థిక సంవత్సరంలో 55.12 మిలియన్ ప్రయాణికులను, దాదాపుగా 1000 ఎయిర్ ట్రాఫిక్ కదలికల్ని ప్రతీరోజూ నిర్వహిస్తుంది. ఈ ఎయిర్ పోర్టు 54 ఇంటర్నేషనల్ రూట్స్, 67 డొమెస్టిక్ రూట్లలో ఫ్లైట్లను ఆపరేట్ చేస్తోంది.
