Site icon NTV Telugu

Mumbai: హోటల్‌కు బూటకపు బాంబు బెదిరింపు.. రూ.5కోట్లు ఇవ్వకుంటే పేల్చేస్తామంటూ..

Hoax Bomb Threat

Hoax Bomb Threat

Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల 26/11 తరహా దాడి చేస్తామని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు పాకిస్థాన్‌ నుంచి మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకుంటే హోటల్‌ను పేల్చేస్తామని అగంతుకులు ఫోన్‌ కాల్స్ చేశారు. అది నకిలీ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ముంబైలోని ప్రముఖ లలిత్ హోటల్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుండి బూటకపు బాంబు బెదిరింపు వచ్చినట్లు ముంబై పోలీసులు ఇవాళ తెలిపారు.సోమవారం సాయంత్రం కూడా కాల్ చేసిన వ్యక్తి బాంబులను నిర్వీర్యం చేయడానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడు. హోటల్‌లో 4 వేర్వేరు ప్రదేశాలలో బాంబులు ఉన్నాయని పేర్కొన్నాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి హోటల్‌కు ఫోన్ చేసి, హోటల్‌లో నాలుగు చోట్ల బాంబులు ఉంచామని.. వాటిని నిర్వీర్యం చేసేందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని ముంబై పోలీసులు తెలిపారు.

Finland Prime minister: ఫిన్లాండ్ ప్రధానికి డ్రగ్ టెస్ట్.. ఏం తేలిందంటే?

ముంబైలోని లలిత్ హోటల్‌కు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బెదిరింపు కాల్ రావడంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు అన్నిచోట్లా వెతికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అంతా గాలించిన పోలీసులు బూటకపు బెదిరింపుగా నిర్ధారించారు. హర్ పోలీస్ స్టేషన్ ఐపీసీ సెక్షన్ 385, 336 మరియు 507 కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.గత నెల, ముంబైలోని అంబర్‌నాథ్ రైల్వే స్టేషన్‌లో బాంబులు తీసుకెళ్తున్న వ్యక్తి గురించి బూటకపు కాల్స్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కళ్యాణ్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మార్చిలో ముంబై యూనివర్సిటీ క్యాంపస్‌లో తప్పుడు బాంబు పేలుడు బెదిరింపు ఆరోపణలపై ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

Exit mobile version