NTV Telugu Site icon

Madhya Pradesh: మహిళలు తమ భర్తల్ని ఇంట్లోకే మద్యం తెచ్చుకోని తాగమనండి.. మంత్రి సలహా..

Madhyapradesh

Madhyapradesh

Madhya Pradesh: పురుషులు మద్యపానం మానేందుకు మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా ఇచ్చిన సలహా చర్చనీయాంశంగా మారింది. మహిళలు తమ భర్తలను ఇంట్లోకే మద్యం తెచ్చుకుని తాగమని చెప్పారు. దీంతో అయినా వారు సిగ్గుపడి తాగడం మానేస్తారని సూచించారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో జరిగిన నషా ముక్తి అభియాన్ కార్యక్రమంలో సామాజిక న్యాయం మరియు వికలాంగుల సాధికారత మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా ఈ వ్యాఖ్య చేశారు.

Read Also: America : సెలూన్ లోకి దూసుకెళ్లిన మినీ వ్యాన్.. నలుగురు మృతి, తొమ్మిది మందికి గాయాలు

‘‘బయట మద్యం తాగి వచ్చే మగవాళ్లకు, వాళ్ల భార్యలు ఇంట్లోకే మద్యం తెచ్చుకుని తాగమని చెప్పాలి. ఇంట్లో ఆడవాళ్లు, పిల్లల ముందు మద్యం సేవిస్తే వాళ్లు అవమానంగా భావించి క్రమంగా తాగడం మానేస్తారు. తాగుడు వ్యసనాన్ని వదిలించుకుంటారు’’ అని మంత్రి అన్నారు. మద్యం మత్తలో ఇంటికి వచ్చే వారికి భోజనం పెట్టొద్దని మంత్రి మహిళలకు సూచించారు. సామాజిక విలువల వల్ల చాలా మంది ఇలా చేయలేకపోతున్నారని కానీ వారికి బుద్ధిరావడం లేదని చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతూ.. నిషేధం అమలులో ఉన్న చాలా రాష్ట్రాల్లో మద్యం దొరుకుతుందని, రాష్ట్రంలో మద్యపాన నిషేధం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు. గతంలో తానున మద్యపాన నిషేధాన్ని సూచించానని చెప్పారు.