NTV Telugu Site icon

MotoGP: ఇండియా మ్యాప్‌ని తప్పుగా చూపినందుకు MotoGP క్షమాపణలు..

Motogp

Motogp

MotoGP: మోటార్ సైకిల్ రోడ్ రేసింగ్ ఈవెంట్లకు ప్రసిద్ధి చెందిన MotoGP భారత మ్యాపును తప్పుగా చూపింది. ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో జరుగుతున్న ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారంలో భారత మ్యాపును తప్పుగా చూపింది. దీంతో MotoGP చేసిన తప్పును నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

Read Also: India-China: భారత ఆటగాళ్లకు అనుమతివ్వని చైనా.. పర్యటన రద్దు చేసుకున్న అనురాగ్

అయితే, చేసిన తప్పుకు శుక్రవారం MotoGP క్షమాపణలు చెప్పింది. ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో మ్యాపును వక్రీకరించి చూపినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పింది. మా ఆతిథ్య దేశం మద్దతు, ప్రశంసల కంటే ఇలా చేయడం మా ఉద్దేశం కాదు’’ అని చెప్పింది.

జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు లేకుండా మ్యాపును MotoGP బ్రాడ్‌కాస్ట్ లో కనిపించింది. దీనిపై విమర్శలు వ్యక్తమవ్వడంతో క్షమాపణలు చెప్పింది. MotoGP అంటే మోటార్ సైకిల్ గ్రాండ్ ఫ్రిక్స్. ఇది మోటార్ రేసింగ్ ఈవెంట్లకు ప్రసిద్ధి చెందింది.