Site icon NTV Telugu

Pushkar Fair 2025: పుష్కర్ మేళాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా 23 కోట్ల గేదె, 15 కోట్ల గుర్రం

Untitled Design (4)

Untitled Design (4)

ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్ద పశువుల జాతర జరుగుతుంది. పుష్కర్ మేళాలో 23 కోట్ల విలువైన గేదె, 15 కోట్ల విలువైన గుర్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ పశువులు, గుర్రాలు, ఒంటెలను అమ్ముతుంటారు, కొంటుంటారు. ఈ జాతర అజ్మీర్ లో జరుగుతుంది. ఈ సంతలో మార్వారీ జాతి గుర్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈసారి పంజాబ్, హర్యానా నుండి వచ్చిన కొన్ని గుర్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటి ధరలు కోట్ల రూపాయల వరకు ఉన్నాయి.

Read Also: Viral Video: పోలీసులనే చలాన్ కట్టాలని నిలదీసిన యువకుడు..

అజ్మీర్ పుష్కర్ పశువుల సంత ఘనంగా నిర్వహిస్తున్నారు. కొత్త ఇసుక సంత మైదానంలో గుర్రాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన చాలా మంది గుర్రపు పెంపకందారులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రమోద్ పరాశర్ దగ్గర బ్రహ్మదేవ్ అనే మార్వారీ గుర్రాన్ని పెంచుతున్నాడు. దానిని ఈ సారి ఈ ఉత్సవానికి తీసుకుని వచ్చాడు. బ్రహ్మదేవ్ తండ్రి డానా అనే గుర్రం గతంలో అత్యధిక ధరకు అమ్ముడు పోయింది. ప్రస్తుతం దీనిని భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని సొంతం చేసుకున్నారు.

Read Also: Kidney Disease: హెయిర్ డై వాడుతున్నారా.. అయితే జాగ్రత..

బికనీర్ కు చెందిన ఒక పశువుల యజమాని 800 కిలోల బరువున్న ముర్రా జాతి గేదెను పుష్కర్ ఇసుక దిబ్బలకు తీసుకువచ్చాడు. ఆ గేదె విలువ దాదాపు ₹10 లక్షలు. అలాగే, బాదల్ అనే ఐదేళ్ల గుర్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. బాదల్ ఇప్పటికే 285 ఫోల్స్ కు తండ్రి.. దాని విలువ 11 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, అతని యజమాని రాహుల్ కు దానిని అమ్మే ఉద్దేశం లేనట్టు సమాచారం. 15 కోట్ల విలువైన షాబాజ్ అనే గుర్రం, 23 కోట్ల విలువైన అన్మోల్ అనే గేదె భారతదేశం అంతటా విదేశాల నుండి వ్యాపారులు పర్యాటకులను ఆకర్షించాయి. 9 కోట్ల వరకు ఆఫర్లు వచ్చాయి” అని షాబాజ్ యజమాని చెప్పారు. అన్మోల్ యజమాని తనను “రాచరికంగా పెంచారని” చెప్పాడు. భక్తులతో పాటు, దేశీయ, విదేశీ పర్యాటకులు ప్రతిరోజూ జాతరను ఎక్కువగా వస్తున్నారు.

Exit mobile version