Site icon NTV Telugu

Indigo: సిక్ లీవ్ పేరుతో ఉద్యోగులంతా ఇంటర్వ్యూలకి.. విమాన రాకపోకలు ఆలస్యం

Indigo Airlines

Indigo Airlines

ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగోకు సంబంధించిన విమానాలు శనివారం పెద్ద సంఖ్యలో ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ఆ సంస్థకు చెందిన 55 శాతం మంది సిక్‌లీవ్‌లో వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు చాలా వరకు సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. శనివారం ఒక్కరోజే దాదాపు 900 సర్వీసులపై ఈ ప్రభావం పడినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించిది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నుంచి వివరణ కోరింది. అయితే, సిక్‌లీవ్‌ పెట్టిన సిబ్బంది అంతా ఎయిర్‌ ఇండియా నిర్వహిస్తోన్న ఉద్యోగ నియామకాల ఇంటర్వ్యూల కోసం వెళ్లినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇండిగో సంస్థ నిత్యం దాదాపు 1600 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నడిపిస్తోంది. ఇందులో శనివారం చాలా సర్వీసులు నడవలేదు. ఆదివారం కూడా ఇదే విధమైన సమస్య తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ స్పందించారు. ఈ పరిణామంపై దృష్టి సారించామని అన్నారు. అయితే, దీనిపై ఇండిగో మాత్రం స్పందించలేదు.

Tomato Prices: మొన్నటివరకూ భారీ ధర…ఇప్పుడేమో నేలచూపులు

ఎయిర్​ ఇండియాను ఈ ఏడాది జనవరి 27న కేంద్రం.. టాటా గ్రూప్‌కు తిరిగి అప్పగించింది. గతేడాది అక్టోబర్​ 8న వేసిన బిడ్డింగ్‌​లో గెలిచి విమానయాన సంస్థ నిర్వహణ, నియంత్రణను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది టాటా గ్రూప్​. ఈ నేపథ్యంలోనే కొత్త విమానాలను కొనుగోలు చేసి సేవల్ని మెరుగుపర్చుకోవాలని చూస్తున్న ఎయిర్​ ఇండియా ఇటీవలే రిక్రూట్‌మెంట్ డ్రైవ్​ ప్రారంభించింది. ఈ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిలో చాలా మంది సిక్ లీవ్‌లో ఉండటం, ఎయిరిండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ హాజరు కావడానికి వెళ్లడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిసింది. టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియాలో ఫేస్ 2 రిక్రూట్‌మెంట్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. చాలా మంది క్యాబిన్ క్రూ మెంబర్లు సిక్ లీవ్ పెట్టి, ఎయిరిండియా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొనేందుకు వెళ్లారని అధికారులు చెప్పారు.

Exit mobile version