Site icon NTV Telugu

వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ విడుదల

Parliament

Parliament

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సెషన్స్‌ ఆగస్టు 13వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఇక వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది మోడీ ప్రభుత్వం. విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రైవేట్‌ కంపెనీలను అనుమతించే బిల్లు కూడా ఇందులో ఉంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 15వ తేదీ లోపల ముగుస్తుంటాయి. సమావేశాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన సహచర మంత్రివర్గ సభ్యులకు సూచించారు. కరోనా సంక్షోభంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేవిధంగా సిద్ధమై రావాలన్నారు.. ఇక, కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను నిలువరించేవిధంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు.

Exit mobile version