Monkeypox: యూరప్ రకానికి భిన్నంగా ఇండియా మంకీపాక్స్ వైరస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox In India: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే 78కు పైగా దేశాల్లో 18 వేల కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాలు ఈ వ్యాధికి ఎక్కువగా గురువుతున్నాయి. ఒక్క యూరప్ దేశాల్లోనే 70 శాతం కేసులు నమోదు అవ్వగా.. 25 శాతం కేసులు అమెరికా ప్రాంతంలో నమోదు అయ్యాయి.ఇక ఇండియాలో కూడా ఇప్పటికే 4 మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కేరళలో మూడు, ఢిల్లీలో ఒక కేసు నమోదు అయింది. అయితే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇదిలా ఉంటే ఇండియాలో మంకీపాక్స్ వైరస్ రకం..యూరోపియన్ రకంతో పోలీస్తే భిన్నంగా ఉందని..సైంటిస్టులు కనుక్కున్నారు. పుణెలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఐసీఎంఆర్-ఎన్ఐవీ) శాస్త్రవేత్తలు.. రెండు రకాల వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించారు. ప్రస్తుతం ఇండియాలోని మంకీపాక్స్ వైరస్ ఏ.2 రకానికి చెందినదిగా గుర్తించారు. ఇది మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ కు వచ్చింది. అంతకుముందు ఈ రకం థాయ్ లాండ్, యూఎస్ లో 2021లో వ్యాధి వ్యాప్తికి కారణం అయింది.
Also Read
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
Read Also: Karnataka: ఇక ఎన్ కౌంటర్లే అంటూ.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
యూరప్ దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి తీవ్రమైన వ్యాప్తికి కారణం అవుతున్న వైరస్ బీ.1 రకానికి చెందినదిగా గుర్తించారు. ఈ వైరస్ రకమే యూరప్ లోని వ్యాధి పెరగడానికి కారణం అవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కేసుల్లో ఎక్కువగా ఈ బీ.1 రకానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్లే కలుగుతున్నాయి. బీ.1, ఏ2 రకానికి పూర్తిగా విభిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే ఈ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఒ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కొద్ది సమయంలోనే అనేక కేసులు నమోదు అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది డబ్ల్యూహెచ్ఓ.
తాజావార్తలు
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!