Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. ఢిల్లీలో రెండో కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigerian Man Tests Positive For Monkeypox In Delhi: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఢిల్లీలో ఓ నైజీరియన్ జాతీయుడికి ఈ వ్యాధి సోకింది. 35 ఏళ్ల నైజీరియన్ గత ఐదు రోజులుగా శరీరంపై దద్దర్లు, జ్వరం రావడంతో ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. తాజాగా సోమవారం వచ్చిన రిపోర్టులో అతనికి పాజిటివ్ గా తేలింది. మరో ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులు కూడా మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశంలో ఇప్పటి వరకు 6 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఢిల్లీలో 2 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఢిల్లీలో వచ్చిన రెండు కేసులు కూడా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికే వచ్చింది. బాధితులిద్దరు ఢిల్లీని వదిలి ఇతర దేశాలకు కానీ.. ఇతర ప్రాంతాలకు కానీ ప్రయాణించిన చరిత్ర లేదు. ఇక కేరళలో వచ్చిన మూడు మంకీపాక్స్ కేసుల్లో బాధితులంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారే. తాజాగా కేరళ త్రిస్సూర్ కు చెందిన వ్యక్తి మంకీపాక్స్ తో బాధపడుతూ మరణించాడు. దీంతో దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. ప్రస్తుతం మరణించిన వ్యక్తితో సంబంధం ఉన్న మొత్తం 20 మంది కేరళ ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచింది.
Also Read
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
Read Also: Madhya Pradesh: అమానవీయ ఘటన.. అంబులెన్స్ లేక బైక్ పై తల్లి శవంతో స్వగ్రామానికి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల్లో 18000కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం ఒక్క స్పెయిన్ దేశంలోనే మంకీపాక్స్ తో ఇద్దరు మరణించారు. స్పెయిన్ తో పాటు బ్రిటన్, బెల్జియం దేశాల్లో ఎక్కవ మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. యూరోపియన్ దేశాల్లోనే 70 శాతం మంకీపాక్స్ కేసులు నమోదు కాగా.. అమెరికా ప్రాంతంలో 25 శాతం మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల కాలంలో మంకీపాక్స్ కేసులు తీవ్రత పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధించింది. న్యూయర్క్ లో మంకీపాక్స్ వల్ల ఎమర్జెన్సీ విధించారు అమెరికా అధికారులు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి