Site icon NTV Telugu

Monkeypox: ఇండియాలో తొలిసారి మహిళలో మంకీపాక్స్ వైరస్.. తొమ్మిదికి చేరిన కేసుల సంఖ్య..

Monkeypox Case

Monkeypox Case

India Reports 9th Monkeypox Case:దేశంలో మంకీపాక్స్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రెండు రోజుల వరకు కేవలం 5 లోపే ఉన్న కేసులు తాజాగా 9 కి చేరాయి. తాజాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ వైరస్ సోకింది. తాజాగా వచ్చిన మంకీపాక్స్ కేసు కూడా విదేశీయురాలికే సోకింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటి వరకు ఢిల్లీలో నలుగురికి మంకీపాక్స్ సోకితే.. ఇందులో ముగ్గురు విదేశీయులే ఉన్నారు. కేరళలో ఇప్పటికే ఐదు మంకీపాక్స్ కేసులు రాగా.. అందులో యూఏఈ నుంచి కేరళకు వచ్చిన త్రిస్సూర్ కు చెందిన యువకుడు మరణించాడు. నిన్న కూడా ఢిల్లీలో 35 ఏళ్ల విదేశీయుడికి మంకీపాక్స్ సోకింది. ఇలా ఢిల్లీలో మంకీపాక్స్ సోకిన వారిలో ఎవరికీ కూడా ట్రావెల్ హిస్టరీ లేదు. ప్రస్తుతం మంకీపాక్స్ సోకిన వారికి ఢిల్లీలోని లోక్ నాయక్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంకీపాక్స్ అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మంకీపాక్స్ రోగులకు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని మూడు ప్రైవేటు ఆస్పత్రులను కోరింది. ప్రస్తుతం ఢిల్లీలోొ నమోదైన నాలుగు కేసుల్లో ఒక్కరు భారతీయుడు కాగా.. ముగ్గురు నైజీరియా జాతీయులు.. తాజాగా నమోదైన కేసు నైజీరియాకు చెందిన మహిళలో మంకీపాక్స్ వైరస్ ను గుర్తించారు.

Read Also: Srilanka Economic Crisis: మోదీ నాయకత్వంలోని భారత్ మాకు ప్రాణం పోసింది.. శ్రీలంక అధ్యక్షుడి కృతజ్ఞతలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 78 దేశాల్లో 18 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల ఆఫ్రికా వెలుపల స్పెయిన్, బ్రెజిల్ దేశాల్లో మరణాలు సంభవించాయి. స్పెయిన్ లో ఆదివారం ఒకే రోజు ఇద్దరు మంకీపాక్స్ వల్ల మరణించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే ఒక్క యూరప్ ఖండంలోని 70 శాతం కేసులు ఉండగా.. అమెరికాలో 25 శాతం కేసులు ఉన్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల మంకీపాక్స్ వ్యాధిని గ్లోబల్ ఎమర్జెన్సీ వ్యాధిగా ప్రకటించింది. స్వలింగ సంపర్కాలు పెట్టుకోవడం వల్లే 90 శాతానికి పైగా కేసులు వస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యవంతుడు రెండు వారాల్లో వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉందని.. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Exit mobile version