Monkey snatches bag: ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోతుల బెదడ ఎక్కువైంది. ఊళ్లలో మనుషులపై దాడులతో పాటు పంటను ధ్వంసం చేస్తున్నాయి. అడవులు తరిగిపోవడంతో కోతులు ఊళ్లపై పడుతున్నాయి. కొన్ని సార్లు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. మనం వంటిళ్లలో కొన్ని సందర్భాల్లో పోపుల పెట్టెల్లో బంగారాన్ని పెట్టుకుంటాం.. కొన్నిసార్లు ఈ డబ్బాలను కూడా కోతులు తీసుకెళ్లిన ఘటనలు గతంలో జరిగాయి.
Read Also: Canada: “పెరట్లో పామును పెంచుతున్నాం”.. ఖలిస్తానీలపై భారత సంతతి ఎంపీ హెచ్చరిక..
ఇదిలా ఉంటే ఆహారం కోసం వెతుకుతున్న కోతి ఏకంగా రూ.1 ఉన్న బ్యాగును దొంగిలించింది. ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్ లో ఈ ఘటన జరిగింది. మంగళవారం షహాబాద్ లోని రిజస్ట్రీ కార్యాలయానికి సేల్ డీడ్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి బ్యాగును ఎత్తుకెళ్లింది. బైకులో పెట్టిన బ్యాగును కోతి ఎత్తుకెళ్లడం అక్కడి కెమెరాలో రికార్డైంది. ఢిల్లీలో నివసిస్తున్న షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి తన మోటారు సైకిల్‌ను పార్క్ చేసి, పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చున్నాడు. సేల్ డీడ్ కు సంబంధించిన పనులు చేస్తుండగా.. ఒక కోతి పార్క్ చేసిన బైక్ నుంచి బ్యాగుతో చెట్టుపైకి చేరింది.
హుస్సేన్ బ్యాగులో లక్ష ఉన్నాయని గ్రహించే లోపే కోతి అక్కడ నుంచి అదృశ్యమైంది. సంఘటన స్థలంలో ఉన్న ప్రజలు కోతి కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు అక్కడే ఉన్న ఓ చెట్టుపై కోతి ఉంది. కోతి నుంచి బ్యాగ్ ని తీసుకునేందుకు జనాలు ప్రయత్నించారు. కొంత సమయం తర్వాత కోతిని అక్కడ నుంచి తరిమేశారు. చివరకు హుస్సేన్ తన బ్యాగ్ అందులో ఉన్న లక్ష రూపాయలను తిరిగిపొందగలిగాడు. షహాబాద్‌లో కోతుల బెడద పెరుగుతున్న దృష్ట్యా సిమియన్‌లను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టేందుకు ఒక బృందాన్ని నియమించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కోతుల బెడదను అరికట్టేందుకు తహసీల్ స్థాయిలో కోతులను పట్టుకుని అడవుల్లో వదలడం జరుగుతుందని షహాబాద్ డిప్యూటీ కలెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.