NTV Telugu Site icon

Mohammed Shami: మహ్మద్ షమీ “క్రిమినల్”.. ముస్లిం సంస్థ చీఫ్ ఆగ్రహం.. ఏమైందంటే..

Shami

Shami

Mohammed Shami: టీం ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ, షమీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షమీ ఓ క్రిమినల్ అంటూ విమర్శలు చేశారు. క్రికెట్ మ్యాచ్ కారణంగా షమీ రంజాన్ మాసంలో ‘‘రోజా’’ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ మ్యాచ్ సమయంలో షమీ నీరు తాగుతూ, ఇతర కూల్ డ్రింక్స్ తాగుతూ కనిపించాడని షాబుద్దీన్ పేర్కొన్నాడు.

Read Also: Jaishankar: లండన్‌లో జైశంకర్‌పై దాడిని ఖండించిన భారత్

‘‘ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశాలను పంపుతుంది. రోజాని పాటించకపోవడం ద్వారా అతను నేరం చేశాడు. అతను అలా చేయకూడదు. షరియత్ దృష్టిలో అతను ఓ నేరస్తుడు. అతడు దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది’’ అని ఓ వీడియో మెసేజ్‌లో షాబుద్దీన్ అన్నారు. షమీని విమర్శిస్తూ, రంజాన్ సందర్భంగా రోజా ప్రాముఖ్యతను వివరిస్తూ, ‘‘ఆరోగ్యంగా ఉన్న ఏ పురుషుడు, స్త్రీ అయినా రోజా పాటించకపోతే, పెద్ద నేరస్తులు అవుతారు’’ అని అన్నారు.