NTV Telugu Site icon

PM Modi: దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న డబ్బుపై మోడీ ఆసక్తికర వివరణ

Pm Modi

Pm Modi

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్ ముగిసింది. మరోసారి అధికారాన్ని సొంత చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థల పేర్లు తరచూ వినబడుతుంటాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేనంతగా, దేశంలో ఈడీ దాడులు అధికమయ్యాయి. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తునే ఉన్నాయి. వారికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు. ఈ సందర్భంగా అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న డబ్బుపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాన్ని పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.

READ MORE: VIGNAN Schools: రాష్ట్రంలో CBSE పదో తరగతి ఫలితాల్లో విజ్ఞన్‌కే మొదటి ర్యాంకు

‘‘గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం న్యాయబృందం సలహా కోరుతాం. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోం. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయవ్యవస్థను కోరా’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ అంశంపై ప్రధాని మరోసారి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాన్ని పెట్టుకోవడానికి ప్రజలే కారణమన్నారు. మునుపెన్నడూ లేనంతగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని.. వాళ్లే తమలో విశ్వాసం నింపారని పేర్కొన్నారు.