Site icon NTV Telugu

PM Modi: ఎన్నికల ముంగిట నేడు బెంగాల్‌కు మోడీ.. వందే భారత్ స్లీపర్‌ను ప్రారంభించనున్న ప్రధాని

Modi1

Modi1

త్వరలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే అధికారి పార్టీ తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా-నేనా? అన్నట్టుగా మాటలు తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇంకోవైపు ఈడీతో టీఎంసీ ఫైట్ చేస్తోంది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణ సమయంలో ప్రధాని మోడీ ఈరోజు పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్నారు. ఈ పర్యటన పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది.

ప్రధాని మోడీ శనివారం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా తొలుత హౌరా నుంచి గౌహతి మధ్య మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం మాల్డాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రూ.3250 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి.. శంకుస్థాపనలు చేయనున్నారు.

హూగ్లీ జిల్లా సింగూర్‌లో రూ.830 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే బాలాగఢ్‌లో ఎక్స్‌టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానించేలా 7 అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

త్వరలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం మమత ప్రయత్నిస్తుండగా.. ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తాపత్రాయపడుతోంది. ఇలా రెండు పార్టీల మధ్య భీకర యుద్ధం జరిగేలా కనిపిస్తోంది. ఇంకోవైపు ఎన్నికల సమయంలో ఈడీ దాడులు చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ సర్కార్ మండిపడుతోంది.

Exit mobile version