Modi-Kharge: మోడీ-ఖర్గే మధ్య సరదా సంభాషణ.. మనసారా నవ్వుకున్న నేతలు

  • మోడీ-ఖర్గే మధ్య సరదా సంభాషణ
  • మనసారా నవ్వుకున్న నేతలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Modi1

Modi1

పార్లమెంట్ వేదికగా మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భంగా మోడీ-రాహుల్ గాంధీ చాలా సేపు ముచ్చటించుకున్నారు. తల్లి సోనియాగాంధీ ఆరోగ్య విషయాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచాయి.

తాజాగా మరోసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈసారి ప్రధాని మోడీ-రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మధ్య సరదా సంభాషణ జరిగింది. దీంతో మోడీ-ఖర్గే మనసారా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే పార్లమెంట్ ప్రాంగణంలోని ‘ప్రేరణ స్థల్’ దగ్గర భారతరత్న డాక్టర్ బీఆర్. అంబేద్కర్ చిత్రపటానికి మోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర నాయకులు నివాళులర్పించారు. అధికార-ప్రతిపక్ష నేతల మధ్య సరదా సన్నివేశాలు సోషల్ మీడియాను ఆకట్టుకుందింది. ఇదిలా ఉంటే ఈనెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు.