Site icon NTV Telugu

PM Modi: ప్రెస్‌మీట్‌కు ముందు సీనియర్ మంత్రులతో మోడీ కీలక సమావేశం

Modipm

Modipm

ప్రధాని మోడీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత వేర్వేరు సందర్భాల్లో మోడీ మాట్లాడారు. కానీ ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రసంగించడం మాత్రం ఇదే తొలిసారి. అయితే ప్రెస్‌మీట్‌కు ముందు ప్రధాని మోడీ.. సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, సైనిక అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి: DGMO Meeting: ముగిసిన భారత్-పాక్ డీజీఎంవోల చర్చలు.. ఏం తేల్చారంటే..!

ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధిపతులు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఉగ్రవాదులకు అండగా నిలిచిన పాకిస్థాన్‌కు భారత్ త్రివిధ దళాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. శత్రువుల నుంచి ఎలాంటి దాడులు ఎదురైనా తమ దళాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పాకిస్థాన్‌లోని కిరణా హిల్స్‌లో అణు కేంద్రం ధ్వంసం అయినట్లు వస్తున్న వార్తలపై కూడా కీలక వ్యా్ఖ్యలు చేశారు. మొత్తానికి భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది.

ఇది కూడా చదవండి: Viral Video: పాకిస్తానీ మిరాజ్ ఫైటర్ జెట్‌ కూల్చివేత.. వీడియో వైరల్..

 

Exit mobile version