Site icon NTV Telugu

Rajnath Singh: ‘‘ప్రధాని గురించి మీరందరికి తెలుసు’’ యుద్ధంపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: 26 మంది ప్రాణాలను బలితీసుకున్న ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ దాడి వెనక పాక్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారతీయులు కోరుకుంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు, ఆర్థిక చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సైనిక చర్యలు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వరసగా ప్రధాని మోడీ, టాప్ మినిస్టర్స్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Read Also: Mangoes: ఇలాంటి మామిడి పండ్లు తింటున్నారా? మీకు క్యాన్సర్ ముప్పు తప్పదు?

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసిన వారికి తగిన సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి ఆదివారం అన్నారు. రాజ్‌నాథ్‌కి ముందు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కూడా ఉగ్రవాదులను వెతికి మరి మట్టుపెడతాం అని చెప్పారు. “ఈ సంఘటనకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, భారత గడ్డపై ఇటువంటి దుర్మార్గపు చర్యలకు కుట్ర పన్నిన వారిని కూడా మేము చేరుకుంటాము” అని రాజ్‌నాథ్ షింగ్ అన్నారు.

‘‘మన దేశంపై దాడి చేయడానికి ధైర్యం చేసే వారికి తగిన సమాధానం ఇవ్వడం నా బాధ్యత. ప్రధాని నరేంద్రమోడీ పనితీరు, పట్టుదల మీ అందరికి తెలుసు’’ అని రక్షణ మంత్రి అన్నారు. ఈ వారం ప్రారంభంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు చర్యలు తీసుకోవడానికి ప్రధాని పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. 2016 ఉరి ఉగ్రవాద దాడి, 2019 పుల్వామా దాడికి ప్రతిస్పందనగా భారతదేశం వరుసగా సర్జికల్ స్ట్రైక్స్ మరియు బాలాకోట్ వైమానిక దాడులను నిర్వహించింది. ఈసారి మోడీ ప్రభుత్వం ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version