Modi-Fadnavis: మోడీతో మరోసారి ఫడ్నవిస్ భేటీ.. కేంద్ర కేబినెట్లోకి వెళ్లనున్నరా?
- మోడీతో మరోసారి ఫడ్నవిస్ భేటీ
- కేంద్ర కేబినెట్లోకి వెళ్లనున్నరా?
- క్లారిటీ ఇచ్చేసిన దేవేంద్ర ఫడ్నవిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. దీంతో మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో హుటాహుటినా ఢిల్లీకి వెళ్లి మోడీని కలిశారు. దీంతో ఫడ్నవిస్‌కు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించవచ్చని కథనాలు వచ్చాయి. తాజాగా సోమవారం మరోసారి ప్రధాని మోడీని కలవడంతో ఆ ఊహాగానాలు మొదలయ్యాయి.

Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
అయితే కేంద్ర కేబినెట్లోకి వెళ్లే అంశంపై ఫడ్నవిస్ క్లారిటీ ఇచ్చేశారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. తనను మహారాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారని.. రాష్ట్ర బాధ్యతలు నెరవేర్చడమే తన ప్రాధాన్యత అని స్పష్టత ఇచ్చారు. ‘‘ఎవరైనా ఊహాగానాలు చేయాలనుకుంటే..ఎన్ని గాలిపటాలు ఎగరేయాలనుకుంటే అన్ని పుకార్లు వ్యాప్తి చేయాలనుకుంటే అలాగే చేయనివ్వండి. మహారాష్ట్ర ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. మా నాయకుడు నరేంద్ర మోడీ మహారాష్ట్ర బాధ్యతను నాకు అప్పగించారు. నేను ఈ బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటాను.’’ అని స్పష్టం చేశారు.
ఏం చర్చించారంటే..
తాను మహారాష్ట్రలోని ముంబైలో ఉన్నానని.. మహారాష్ట్రలోనే ఉంటానని దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టంగా తెలిపారు. ఈ ప్రకటనతో కేంద్ర మంత్రిగా నియామకంపై జరుగుతున్న చర్చలకు తెరపడినట్లు కనిపిస్తోంది. తాను ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినట్లు ఫడ్నవిస్ వెల్లడించారు. ఈ సమావేశం మహారాష్ట్రలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించడంతో పాటు రాబోయే ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వంతో కూలంకషంగా చర్చించినట్లు వెల్లడించారు.

గ్రామీణాభివృద్ధి, ముంబై మెట్రో, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, రహదారుల నిర్మాణం వంటి మహారాష్ట్రకు సంబంధించిన అనేక ప్రధాన ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. మహారాష్ట్రకు సాధ్యమైనంత సహాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. తాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసినట్లు ఫడ్నవిస్ చెప్పారు. వేర్ కారిడార్ విషయంలో జపాన్‌కు చెందిన జైకా (JICA)తో కలిసి ముందుకు ఎలా పనిచేయాలనే దానిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయన్నారు. మొత్తానికి ఊహాగానాలపై ఫడ్నవిస్ తెరదించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!