Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!

  • రైతులకు శుభవార్త
  • కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్
  • బొగ్గు గ్యాసిఫికేషన్‌కు నిధులు కేటాయింపు
Modi

Modi

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో వ్యవసాయం, ఇంధనం, మౌలిక వసతుల రంగాలకు ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27కు కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాల కోసం భారీగా రూ.2.6 లక్షల కోట్లను కేటాయించింది. రైతులకు మద్దతుగా ప్రధాన పంటల కొనుగోళ్లను హామీ ధరలకు నిర్వహించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

అదే సమయంలో దేశీయ బొగ్గును గ్యాస్, యూరియా, ఇతర పారిశ్రామిక రసాయనాలుగా మార్చే లక్ష్యంతో రూ.37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఇంధన భద్రత బలోపేతం కావడంతో పాటు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. మరోవైపు గుజరాత్‌లోని సర్కేజ్-ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ లేన్ కారిడార్ నిర్మాణానికి రూ.20,665 కోట్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించనుంది. ఈ నిర్ణయాలతో వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా రంగాల్లో అభివృద్ధికి కేంద్రం మరింత వేగం పెంచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.