ప్రతీరోజు ఎక్కడో ఒక దగ్గర చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా అత్యాచార ఘటనలు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు సురక్షితంగా ఇంటికి చేరతారా? అనే ఆందోళన ఓవైపు.. ఇంట్లో ఉన్నా సేఫ్‌గా ఉంటారా? అనే కలవరం మరోవైపు వెంటాడుతోంది.. అయితే, అత్యాచారాలకు మొబైల్ ఫోన్లు, సమాజంలోని వికృత మనస్తత్వమే కారణమని పేర్కొన్నారు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి.. మొబైల్ ఫోన్లలో అడల్ట్ వీడియోలను సులభంగా యాక్సెస్ చేయడం మరియు సమాజం యొక్క వికృత మనస్తత్వమే అత్యాచారాలకు కారణంగా తెలిపారు.. సూరత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అత్యాచార ఘటనలకు పోలీసులను ఎప్పుడూ నిందిస్తాం.. ఇలాంటి ఘటనలు సమాజానికి మాయని మచ్చ.. ఇలాంటి ఘటనలకు పోలీసులను మాత్రమే నిందించలేం అన్నారు.
Read Also: Accident: పండుగ రోజు ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మన దేశంలో గుజరాత్ అత్యంత సురక్షితమైనది.. అయితే, ఎంత సేఫ్ అయినా.. మన నగరం లేదా రాష్ట్రంలో ఒకటి లేదా రెండు సంఘటనలు జరిగితే.. అది మచ్చే అవుతుందన్నారు.. భారతదేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి మొబైల్ ఫోన్లు, తెలిసిన వ్యక్తులే కారణమని, ఇటీవలి సర్వేలో ఇది వెల్లడైనట్లు పేర్కొన్నారు. తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసినప్పుడు, ఇది పెద్ద సామాజిక సమస్య కాదా? అని ప్రశ్నించిన ఆయన.. తండ్రి తన కుమార్తెపై అత్యాచారం చేస్తే, దానికి కారణం అతని మొబైల్ ఫోన్ కారణంగా తెలిపారు.
