NTV Telugu Site icon

Mobile Phone tracking system: ఫోన్ పోయిందా..? భయపడాల్సిన అవసరం లేదు.. మే 17న కొత్త ట్రాకింగ్ సిస్టమ్ అమలు..

Mobile Tracking System

Mobile Tracking System

Mobile Phone tracking system: మీ ఫోన్ పోయిందని కంగారు పడుతున్నారా..? అయితే ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాకింగ్ సిస్టమ్ ఇకపై భారతదేశం అంతటా అమలులోకి రానుంది. పోయిన ఫోన్‌ని ట్రాక్ చేసి బ్లాక్ చేసేందుకు కొత్త సిస్టమ్ అందుబాటులోకి రాబోతోందని ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాట్రిక్స్(CDoT) అభివృద్ధి చేసిన ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్( CEIR)’ వ్యవస్థను దేశం మొత్తం మే 17 నుంచి అమలు చేయనున్నట్లు తెలిసింది. అయితే సీడాట్ సీఈఓ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ మాత్రం ఇంకా తేదీని ధృవీకరించలేదు.

Read Also: Praveen Sood: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా కర్ణాటక టాప్ పోలీస్..

ప్రస్తుతం CEIR వ్యవస్థను ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్‌లతో సహా కొన్ని టెలికాం సర్కిల్‌లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ త్రైమాసికంలో దేశం మొత్తం ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు. సీడాట్ అన్ని టెలికాం నెట్వర్క్ లలో క్లోనింగ్ చేయబడిని మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసేలా ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో విక్రయించే మొబైల్ ఫోన్లలో IMEI-15 అంకెల ప్రత్యేక ఐడెంటిటీ నెంబర్ ను ముందే బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ప్రతీ మొబైల్ నెట్వర్క్ ఈ నెంబర్ ను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఏదైనా అనధికారిక మొబైళ్లు తమ నెట్వర్క్ పరిధిలోకి వస్తే వెంటనే ఈ CEIR వ్యవస్థ ద్వారా గుర్తించగలుగుతాయి. ఈ వ్యవస్థ ద్వారా ఐఎంఈఐ నెంబర్ మొబైల్ నెంబర్లతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఫోన్లను ట్రాక్ చేయడంతో పాటు వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఫోన్ల దొంగతనాలు తగ్గే అవకాశ ఉంది. అలాగే ఎవరైనా దొంగలిస్తే పోలీసులు గుర్తించడం సులభం అవుతుంది.