Site icon NTV Telugu

మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన త‌మిళ‌నాడు సీఎం…

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు.  ప్రమాణస్వీకారం చేసిన తరువాత మూడు ఫైల్స్ పై స్టాలిన్ సంతకం చేశారు.  అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు ఉన్న 2.07 కోట్ల కుటుంబాల కు రూ.4వేల రూపాయల చొప్పున సాయం అందించే ఫైల్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతకం చేశారు.  ఇందులో మొదటి నెలలో రూ. 2 వేలరూపాయలు, తరువాత నెలలో రెండు వేల రూపాయలను జమ చేయనున్నారు.  ఇక అంతేకాకుండా రాష్ట్రంలో లీటర్ పాలపై రూ.3 తగ్గింపుకు సంబంధించిన ఫైల్ పై కూడా స్టాలిన్ సంతకం చేశారు.  ఎన్నికలకు ముందు డీఎంకే పార్టీ 500 లకు పైగా హామీలతో కూడిన మ్యానిఫెస్టోను రూపొందించింది.  వాటిల్లో ముఖ్యమైన వాటిని ముందుగా అమలు చేసేందుకు స్టాలిన్ ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  

Exit mobile version