Mizoram local body polls: దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి వరసగా ఓటములు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే హర్యానా మేయర్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. చివరకు కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ హుడా ఇలాకాలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. మొత్తం 10 మేయర్ స్థానాల్లో 09ని గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. పదోస్థానంలో బీజేపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.
Read Also: Officer on Duty Review: ఆఫీసర్ ఆన్ డ్యూటీ రివ్యూ
ఇదిలా ఉంటే, తాజాగా మిజోరం స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కాంగ్రెస్ మరోసారి పరాజయం పాలైంది. బుధవారం జరిగిన చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (CADC) స్థానిక ఎన్నికల్లో బీజేపీ 88 గ్రామ కౌన్సిల్ స్థానాలకు గాను 64 స్థానాలను గెలుచుకుని అఖండ విజయం సాధించింది. లాంగ్త్లై జిల్లాలో ఈ ఎన్నికలు జరిగాయి. 88 సీట్లలో 12 స్థానాలు ఏకగ్రీవమైతే, ఇందులో 09 స్థానాలను బీజేపీ, మూడు స్థానాలను జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. చివరిసారిగా 2020లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అయిన ఎంఎన్ఎఫ్ 64 గ్రామ కౌన్సిల్ సీట్లను గెలుచుకుంటే, ఆ సమయంలో బీజేపీ 16 సీట్లలో విజయం సాధించింది