ఇప్పుడు రెండింటిపైనే ప్రధాన చర్చ.. ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ అయితే.. మరోటి.. దానికి చెక్ పెట్టే వ్యాక్సినేషన్… ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రకారం.. నిర్ణీత కాల వ్యవధిలో ఒక్కొక్కరు రెండు డోసులు తీసుకోవాలి.. అయితే, ఇప్పుడు పరిస్థితి కొంత గందరగోళంగా తయారైంది.. ఫస్ట్ డోస్‌గా కొవాగ్జిన్ తీసుకున్న చోట.. ఇప్పుడు కొవిషీల్డ్ టీకా అందుబాటులో ఉంది.. దీంతో.. ఫస్ట్‌డోస్ అది వేసి.. సెకండ్ డోస్ ఇది వేస్తే ఎలా ఉంటుంది? అసలు వేయొచ్చా..? నిపుణులు దీనిపై ఏం చెబుతారు? అనే చర్చ సాగుతుండగా.. కేంద్ర వైద్యారోగ్యశాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది.. వ్యాక్సిన్ డోసుల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని వివరించింది.. రెండు డోసులలోనే వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని వెల్లడించింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత 12 వారాలకు రెండో డోస్ ఇస్తారని, కొవాగ్జిన్ టీకాకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు.. వ్యాక్సిన్‌ల మిక్సింగ్ సాధ్యామా..? అనే దానిపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయన్న కేంద్రం.. వాటివల్ల హానికర రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉండబోవని చెప్పలేమంటున్నారు. ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ల మిక్సింగ్ ప్రక్రియ ఉండబోదని, రెండు డోసులకు ఒకే వ్యాక్సిన్‌ను ఇస్తారని స్పష్టంచేసింది కేంద్ర వైద్యారోగ్యశాఖ.
మిక్సింగ్ వ్యాక్సినేషన్..! క‌్లారిటీ ఇచ్చిన కేంద్రం
vaccines