ఇటీవల నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా.. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే గా గెలిచింది మైథిలి ఠాకూర్. అయితే దాదాపు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. మైథిలి ఠాకూర్ ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి పెద్ద పెద్ద బ్యాంకుల్లో మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఎస్బీఐలో పెట్టిన పెట్టుబడికి గాను గత సంవత్సరంలో 18శాతం రాబడి పొందిందని ఆర్థిక నిఫుణులు వెల్లడించారు.
Read Also: Bride Murder: గంటలో పెళ్లి.. పెళ్లి చీర, డబ్బు విషయంలో వాగ్వాదం.. వధువు హత్య
అయితే మైథిలి ఠాకూర్ కేవలం గాయని మాత్రమే కాదు ఆర్థిక ప్రణాళికలో నిష్ణాతురాలు. ప్రస్తుతం మైథిలీ మొత్తం ఆస్తుల విలువ 4కోట్ల రూపాయలు. మైథిలి సంవత్సర ఆదాయం ఐదేళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. 2019-20లో 12.02 లక్షలు ఉండగా.. . 2023-24లో ఆమె ఆదాయం ఒక్కసారిగా 28.67 లక్షలకు చేరుకుంది. మైథిలి.. సోషల్ మీడియాలో పాటలు పాడడం.. వివిధ బ్రాండ్ లతో ఒప్పందాలు చేసుకోవడంతో ఆదాయం సంపాదిస్తుంది. గతంలో ఆమె 47లక్షల రూపాయలకు భూమిని కొన్నది. అయితే ప్రస్తుతం దాని విలువ 1.5 కోట్ల రూపాయలకు చేరుకుంది.
Read Also:Neck Guards: ఏం ఐడియా గురూ.. .. పులులు బారి నుంచి రక్షించుకోవడం కోసం..
ప్రస్తుతం మైథిలి దగ్గర 53 లక్షల విలువైన 408 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా.. కోటి ఎనబై లక్షల డబ్బుతో పాటు ఓ స్కూటీ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 13 శాతం ఆదాయం రావడంతో పాటు.. ICICI ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ నుంచి దాదాపు 12 శాతం పొందినట్లు అధికారులు తెలిపారు.
