Missing Girl Is Reunited With Her Family After 9 Years: విధి ఎంత విచిత్రంగా ఉంటుందంటే.. ఏడేళ్ల వయసులో కిడ్నాప్ కు గురైనా బాలిక, తన తల్లిదండ్రులు నివసించే ఏరియాలో కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నా, తన కుటుంబాన్ని కలవడానికి తొమ్మిదేళ్లు పట్టింది. వివరాల్లోకి వెళితే జనవరి 22, 2013లో ముంబై అంధేరిలో నివాసం ఉంటున్న ఏడేళ్ల బాలిక పూజ, అతని సోదరుడితో స్కూలుకు వెళ్లింది. ఈ క్రమంలో హెన్రీ డిసౌజా అనే వ్యక్తి పూజకు ఐస్ క్రీమ్ కొనిస్తానని నమ్మించి కిడ్నాప్ చేశాడు. తమకు డిసౌజా దంపతులకు పిల్లలు లేకపోవడంతో పూజను కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో పూజ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎంత వెతికినా.. పోలీసులు రెండేళ్లు కష్టపడ్డా పూజ ఆచూకీ లభించలేదు.
పూజను ముంబైలోనే ఉంచితే గుర్తించే ప్రమాదం ఉందని డిసౌజా.. కర్ణాటక రాయచూర్ లోని ఓ హస్టల్ లో చేర్పించారు. ఆ తరువాత పూజ పేరును అని డిసౌజాగా మార్చారు. అయితే ఈ క్రమంలోనే హెన్రీ డిసౌజా దంపతులకు కొడుకు పుట్టాడు. పూజ పెద్దది కావడంతో ఇక ఎవ్వరూ గుర్తపట్టరని ముంబైకి తీసుకువచ్చారు. గతంలో తన కుటుంబం నివసించే అంధేరి ప్రాంతంలోనే కొన్ని వందల మీటర్ల వ్యవధిలోనే డిసౌజా మకాం మార్చాడు. అయితే ఇద్దరు పిల్లల పెంచడం డిసౌజాకు భారం కావడంతో పూజను స్థానికంగా ఉండే ఇళ్లలో పనికి పంపించే వాడు. అయితే ఓ రోజు తాగిన మైకంలో డిసౌజా, పూజ తన అసలు కూతురు కాదనే వివరాలను బయటపెట్టాడు.
Read Also: Tiger Fear: బాబోయ్ పులి.. కంటిమీద కునుకులేని జనం
అయితే ప్రస్తుతం 16 ఏళ్ల వయసున్న పూజ, ఇప్పుడు తను నివసిస్తున్న ప్రాంతంలోనే తన కుటుంబ సభ్యులు ఉన్నారనే విషయాలను మరిచిపోయింది. అయితే పూజా, ఆమె స్నేహితురాలు ఇంటర్నెట్ లో వెతకగా.. 2013తో తప్పిపోయిన నాటి ఫోటో వివరాలు కనిపించాయి. తప్పిపోయిన సమయంలో బంధువులు పూజా ఫోటోతో పాటు నంబర్లను పోస్టర్లు వేసి గాలించారు. ఇందులో 5 నెంబర్లు ఉండగా.. వీటిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసింది పూజ. అయితే ఇందులో 4 నెంబర్ల ప్రస్తుతం వాడుకలో లేవు.. అయితే లక్కీగా ఒక నెంబర్ కలవడం.. వివరాలను అన్నింటిని చెప్పడంతో బంధువులు షాక్ కు గురయ్యారు. అయితే తన ఈ నెంబర్ చిన్నప్పుడు పూజ ఇంటి పక్కన ఉండే రఫీక్ అనే వ్యక్తిది. దీంతో రఫీక్ వెంటనే పూజ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చివరకు 7 ఏళ్ల వయసులో కిడ్నాప్ కు గురై తప్పిపోయిన పూజ 9 ఏళ్ల తరువాత 16 ఏళ్ల వయసులో సొంత తల్లిదండ్రులను చేరుకుంది. ఈ కేసును విచారించిన పోలీసులు హెన్రీ డిసౌజాతో పాటు అతని భార్యపై కేసులు పెట్టారు.
