Site icon NTV Telugu

Gujarat Video: కారుతో మైనర్ వీరంగం.. 3 ఏళ్ల చిన్నారిపై ఎక్కించి ఏం చేశాడంటే..!

Gujarat Video

Gujarat Video

మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టరీత్యా నేరం. నడిపినా.. ప్రోత్సహించినా నేరమే. నిత్యం పోలీసులు హెచ్చరికలు చేస్తుంటారు. అయినా కూడా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. మైనర్లు వాహనాలు నడిపి ఎంత మంది ప్రాణాలు తీశారో అందరికీ తెలిసిందే. తాజాగా గుజరాత్‌లో కూడా ఒక మైనర్ కారు నడిపి ఓ చిన్నారిని ఢీకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi: ఆ పాలనను 5 పదాల్లో చెప్పొచ్చు.. విపక్ష కూటమిపై మోడీ విసుర్లు

అహ్మదాబాద్‌లోని నోబెల్‌నగర్‌లో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. ఒక మైనర్ వేగంగా కారు నడుపుకుంటూ మలుపు తిప్పాడు. రోడ్డుపై ఎవరున్నారో కూడా చూసుకోకుండా చిన్నారిపైకి ఎక్కించుకుని కొంత దూరం లాక్కెళ్లిపోయాడు. పాపం.. చిన్నారికి భూమ్మీద నూకలు ఉండడంతో క్షేమంగా బయటకు వచ్చేసింది. అనంతరం చుట్టు పక్కల ఉన్న స్థానికులు వచ్చి.. టీనేజర్‌కు దేహశుద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Maharashtra: ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు.. ఎమ్మెల్యేపై కేసు

స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి వచ్చి వీడియోను పరిశీలించారు. కారుకు నంబర్ ప్లేట్ లేనట్లుగా గుర్తించారు. మైనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. కారు కీలను తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు. ఇక అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ వీడియోనే నిదర్శనం అని.. కానీ ప్రతిసారీ కాదు…రోడ్డు ఆట స్థలం కాదు…తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లలపై నిఘా ఉంచాలని మరొకరు రాసుకొచ్చారు. తల్లిదండ్రులు రోడ్లపై పిల్లలు ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇక మైనర్‌కు కారు ఇచ్చిన తల్లిదండ్రులను జైల్లో పెట్టాలని ఇంకొకరు డిమాండ్ చేశారు.

 

Exit mobile version