మెట్రో మ్యాన్ శ్రీధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శ్రీధరన్ ప్రకటించారు. తనకు తత్వం బోధపడిందని.. ఎన్నికల్లో పోటీ చేసి తగిన గుణపాఠం నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు అని… ఇంకా రాజకీయాల్లో ఉండటం, రాజకీయంగా కెరీర్ కొనసాగిస్తే మరింత ప్రమాదంలో పడతానని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతగా ఉండటం తనకు ఇష్టం లేదని.. రాజకీయాలను చేయడం తన డ్రీమ్ కూడా కాదని శ్రీధరన్ స్పష్టం చేశారు.
Read Also: కరోనా వ్యాప్తికి కారణమేంటి?
కాగా కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన శ్రీధరన్… ఆ ఎన్నికల్లో పాలక్కడ్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓ దశలో సీఎం పదవి చేపట్టేందుకు కూడా శ్రీధరన్ మొగ్గు చూపించారు. ప్రత్యర్థులకు మంచి పోటీ ఇచ్చినా ఆయన గెలవలేకపోయారు. ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తాజాగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
