Methane-eating bacteria: భారతదేశంలో మొట్టమొదటి దేశీయ మీథేన్-ఈటింగ్ బ్యాక్టీరియాను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. MACS అఘార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ARI)కి చెందిన శాస్త్రవేత్తలు పశ్చిమ భారతదేశంలోని వరి పొలాలు మరియు చిత్తడి నేలల్లో మెథనోట్రోఫ్స్ అని పిలువబడే ఈ బ్యాక్టీరియాను గుర్తించినట్లు చెప్పారు. డాక్టర్ మోనాలి రహల్కర్ నేతృత్వంలోని టీమ్ ఈ బ్యాక్టీరియాను కనుగొంది. రాబోయే వాతావరణ సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
కార్బన్ డయాక్సైడ్ తర్వాత భూమిపై రెండో అతిపెద్ద గ్రీన్ హౌజ్ వాయువు మీథేన్. కార్బన్ డయాక్సైడ్ కన్నా 26 రెట్లు ఎక్కువ గ్లోబర్ వార్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది చిత్తడి నేలలు, వరి పొలాలు, రుమినెంట్‌లు, పల్లపు ప్రదేశాల్లో మెథనోజెన్‌ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. మీథనోట్రోఫ్స్ లేదా మీథేన్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియాలు మీథేన్‌ని ఆక్సీకరణం చేయడం ద్వారా, వాతావరణంలోని మీథేన్ సాంద్రతను తగ్గిస్తుంది. మీథేన్, ఆక్సిజన్ రెండూ ఉండే చిత్తడి నేతలు, వరిపొలాలు, చెరువులు, ఇతర నీటి వనరుల ఉండే పరిసరాల్లో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
Read Also: Shaurya Doval: పాకిస్థాన్ తో భారత్ కు ముప్పు..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
మిథైలోక్యుమిస్ ఒరిజా అని పిలువబడే బ్యాక్టీరియా అండాకారం, పొడుగు ఆకారం కలిగి ఉందని డాక్టర్ రహల్కర్ టీం కనుగొంది. దీంతో వీటికి ‘‘మిథేన్‌ని తినే దోసకాయలు’’( మిథేన్ ఈటింగ్ కుకుంబర్స్) అనే పేరు కూడా వచ్చింది. అతను ఈ బ్యాక్టీరియాను గుర్తించడానికి ఆరేళ్ల ఏళ్లు, దానిని అర్థం చేసుకోవడానికి పదేళ్ల సమయం పట్టింది. పూణేలోని ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలానికి పేరుగాంచిన వెటల్ టెక్డి అనే కొండ రాతి క్వారీలో ఈ మెథనోట్రోఫ్ ముఖ్యమైన అంశంగా గుర్తించబడింది.
మెథైలోక్యుమిస్ ఒరిజే యొక్క ఆవిష్కరణ ప్రత్యేకంగా గుర్తించదగినది. ఎందుకంటే ఇలాంటి బ్యాక్టీరియాను ప్రపంచంలో ఎక్కడా కల్చర్ చేయడం కానీ గుర్తించడం కానీ జరగలేదు. ఈ బ్యాక్టీరియా ఇతర బ్యాక్టీరియాల కన్నా పెద్దది. పరిమాణంలో చిన్న ఈస్ట్‌తో పోల్చవచ్చు. కఠినమైన మెసోఫిలిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. 37 డిగ్రీ సెల్సియన్ కన్నా ఎక్కువ ఉండే వాతావరణంలో పెరగదు. ఇటీవలి సంవత్సరాలలో, మెథైలోక్యుమిస్ ఒరిజే వరి మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా పుష్పించేలా, ధాన్యం దిగుబడి పెంచుతున్నట్లు కనుగొన్నారు.