NTV Telugu Site icon

Bullet Bike: బుల్లెట్ బైక్ అమ్మేశారని బాలుడు ఆత్మహత్య..

Bullet Bike

Bullet Bike

Bullet Bike: చెడు సహవాసాలు ఎక్కువ అవుతున్నందనే కారణంగా తల్లిదండ్రులు బుల్లెట్ బైక్ అమ్మేయడంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో ఈ ఘటన జరిగింది. 9వ తరతగి చదువుతున్న విద్యార్థి తప్పుడు వ్యక్తులతో తిరుగుతున్నందుకు అతడి కుటుంబం మందలించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెడు సహవాసం చేయకుండా ఉండటానికి అతడి తల్లి, అన్నయ్య తన బుల్లెట్ బైక్‌ని అమ్మేశారు. దీంతో సదరు బాలుడు పిస్టల్‌తో తనను తాను కాల్చుకున్నాడు.

Read Also: Maha kumbh mela: పాకిస్తాన్‌తో సహా ముస్లిం దేశాల్లో ‘‘మహా కుంభమేళ’’ ట్రెండింగ్..

బాలుడి తల్లి, ఒక మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తోంది. జనవరి 12 శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన పెద్ద కొడుకుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. అదే సమయంలో చిన్న కొడుకు బాల్కనీలో నిలబడి కనిపించాడు. కొద్దిసేపటి తర్వాత, తన గదిలోకి వెళ్లి కాల్చుకున్నాడు. కుటుంబ సభ్యులు కిటికీ పగలగొట్టి గదిలోకి ప్రవేశించగా, రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. వైద్యులు అతడు మరణించినట్లు ధ్రువీకరించారు.

ఆత్మహత్యకు ముందు.. బాలుడు మరణం తర్వాత ఆత్మకు ఏం జరుగుతంది అని గూగుల్, యూట్యూబ్‌లో ఆన్‌లైన్ సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బులంద్ షహర్‌కి చెందిన ఈ కటుుంబం అపెక్స్ కాలనీలో ఇల్లు కొనుక్కుని ఉంటోంది. ఆరు నెలల క్రితమే వీరు కొత్త ఇంటికి వచ్చారు. ఒక ఏడాది క్రితం భర్త చనిపోయిన మహిళన తన 17 ఏళ్ల పెద్ద కొడుకుని, మరణించిన అబ్బాయిని ఒంటరిగా పెంచుతోంది. ఘటనాస్థలం నుంచి పోలీసులు పిస్టర్ స్వాధీనం చేసుకున్నారు. బాలుడి చెడు ప్రవర్తనపై కుటుంబం పలుమార్లు మందలించినట్లు తేలింది. ఈ క్రమంలోనే అతడి బుల్లెట్ బైక్ అమ్మేశారని వెల్లడైంది.