NTV Telugu Site icon

Bomb Threat: “ఫన్” కోసం 13 ఏళ్ల బాలుడి తుంటరి పని.. చివరకు..

Delhi

Delhi

Bomb Threat: సరదా కోసం 13 ఏళ్ల బాలుడు తెలిసీ తెలియకుండా చేసిన పని అతని అరెస్ట్‌కి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని బూటకపు ఈమెయిల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌కి చెందిన సదరు బాలుడు ఈ నకిలీ బెదిరింపుల కోసం ఓ ఈమెయిల్ క్రియేట్ చేసి దాని నుంచి మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. టీవీల్లో బాంబు బెదిరింపు వార్తలు చూసిన తర్వాత తనకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చింది. ఫన్ కోసం తాను ఇలా చేశానని చెప్పారు. అధికారులు తనను కనుక్కుంటారో లేదో అని పరీక్షించేందుకు ఇలా చేశానని అన్నారు.

Read Also: Bharateeyudu 2: భారతీయుడు 2లో మరో హీరోయిన్.. ఈ ట్విస్ట్ ఏంటి సామీ!

మెయిల్ పంపేందుకు బాలుడు నకిలీ ఇమెయిల్ ఐడీని సృష్టించాడు. “అతను తన ఫోన్ నుండి మెయిల్ పంపాడు, దాని కోసం అతను తన తల్లి వైఫై కనెక్షన్‌ను ఉపయోగించాడు” అని అధికారులు చెప్పారు. మెయిల్ పంపిన వెంటనే ఈమెయిల్ ఐడీని డిలీట్ చేశాడని వారు తెలిపారు. మరుసటి రోజు అతను ఢిల్లీ విమానాశ్రయంలో బూటకపు బాంబు బెదిరింపు వార్తల్ని చూసి భయపడ్డానని, బాలుడు అతని తల్లిదండ్రులకు బయపడి ఈ విషయం చెప్పలేదని డిప్యూటీ కమిషనర్ ఉషా రంగ్నాని చెప్పారు.

ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకుకి గత మంగళవారం రాత్రి 10.50 గంటలకు మెయిల్ వచ్చింది. దీంతో ఈ విమానం 12 గంటలకు పైగా ఆలస్యం అయింది. ఈ మెయల్ మీరట్‌లో కనుగొనబడింది. తర్వాత ఢిల్లీ నుంచి పోలీసుల బృందం అక్కడి బాలుడిని ప్రశ్నించింది. అతడి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకుని, కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.