Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: పైలట్‌పై తీవ్ర ఆరోపణలు.. ఖండించిన పైలట్ సంఘాలు

Ahmedabadplanecrash

Ahmedabadplanecrash

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దేశంలో జరిగిన ఘోరమైన దుర్ఘటన. దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే కలవరపాటుకు గురి చేసింది. దాదాపు ఈ ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Vijayawada: రెచ్చిపోతున్న దొంగలు.. ఏకంగా ట్రాక్టర్‌ను కంటైనర్‌లో ఎక్కించి జంప్..

అయితే తాజాగా పైలట్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పైలట్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విమాన ప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొక పైలట్‌ను ‘‘నువ్వు ఎందుకు కట్ చేశావు?’’ అని అడుగుతున్నట్లు రికార్డైంది. మరొక పైలట్ ‘‘నేను చేయలేదు’’ అని ప్రతి స్పందించినట్లు తెలుస్తోంది. అంటే పైలట్ల మధ్య ఏదో గందరగోళం నెలకొన్నట్లుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Teenmar Mallanna : ఎమ్మెల్సీ చింతపండు నవీన్ వాఖ్యలపై కేసు నమోదు

అయితే పైలట్లపై వస్తున్న కథనాలను పైలట్ సంఘాలు ఖండించాయి. చనిపోయిన వారిని దూషించొద్దని కోరారు. ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని.. పారదర్శకత కోసం పిలుపునిస్తున్నట్లు తెలిపారు. దయచేసి ఎవరిని బలిపశువులను చేయొద్దని కోరాయి. పైలట్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వస్తున్న మీడియా కథనం పట్ల తీవ్రంగా కలత చెందినట్లు ఎయిర్ ఇండియాలో నారో-బాడీ పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐసీపీఏ తెలిపింది. నిశ్చయాత్మక ఆధారాలు లేకుండా పైలట్లను నిందించడం ఏ మాత్రం భావ్యం కాదని పేర్కొన్నాయి.

వాస్తవానికి ప్రాథమిక నివేదికలో టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఒకదాని తర్వాత ఒకటి.. రెండు ఇంజిన్ ఇంధన స్విచ్‌లు ఆపివేయబడ్డాయని తెలిపింది. 15 పేజీల ప్రాథమిక నివేదికలో సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సూచించింది. కానీ మీడియా కథనాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పైలట్ ఆత్మహత్యతోనే ఈ ఘటన జరిగినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే పైలట్లకు క్రమం తప్పకుండా మానసిక పరీక్షలు, శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని, ప్రొఫెషనల్ ఫిట్‌నెస్, అత్యున్నత ప్రమాణాలను అనుసరిస్తారని ICPA ప్రజలకు గుర్తు చేసింది. దర్యాప్తు ప్రక్రియను గౌరవించాలని మీడియా, ప్రజలను కోరింది. దయచేసి ఎవరూ దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.

Exit mobile version