NTV Telugu Site icon

Aero India Show: ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతంలో మాంసం షాపులు, హోటళ్లు బంద్.. కారణం..?

Aero India Show

Aero India Show

Aero India Show: ఏరో ఇండియా 15వ ఎడిషన్ ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు బెంగళూర్ శివారులోని యలహంకలో జరుగనున్నాయి. ఎరో ఇండియా షో దృష్ట్యా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు యలహంక వైమానిక దళ స్టేషన్ నుంచి 13 కి.మీ పరిధిలో అన్ని మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లను మూసేయాలని బెంగళూర్ నగరపాలక సంస్థ శనివారం ఆదేశించింది.

Read Also: S Jaishankar: ‘‘ పాకిస్తాన్ ఆ క్యాన్సర్‌కే బలవుతోంది’’: జైశంకర్

ఎరో ఇండియా షో జరుగుతున్న 13 కి.మీ పరిధిలో మాంసాహార వంటకాలను అందించడం, అమ్మడం నిషేధిస్తూ బృహత్ బెంగళూర్ మహానగర పాలికే(BBMP) తన పబ్లిక్ నోటీసులో తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారంలో పడేసే మాంసాహారం అనేక స్కావెంజర్ పక్షులను ఆకర్షిస్తుందని, ఇది గాలిలో ప్రమాదాలకు కారణం అవుతుందని తెలిపింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే BBMP చట్టం-2020 , ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని నిబంధన 91 ప్రకారం శిక్ష విధించబడుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖ వైమానిక కంపెనీలు నుంచి తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. 1996 నుంచి బెంగళూర్ కేంద్రంగా ఈ ఎరో ఇండియా కార్యక్రమం జరుగుతోంది.