NTV Telugu Site icon

Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్.. అమృత్‌పాల్ సింగ్ కోసం ముమ్మర గాలింపు.. అనుచరుల అరెస్ట్

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్ నెలకొంది. పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నేత అమృత్ పాల్ సింగ్ కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. అతడిని పట్టుకునేందుకు నిన్న పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పటు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెర్ సర్వీసులను షట్ డౌన్ చేశారు. అమృత్ పాల్ సింగ్ కోసం అనుమానం ఉన్న ప్రాంతాల్లో వెతుకుతున్నారు.

Read Also: Bhatti Vikramarka: ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారు

అయితే అయన సన్నిహితులను, బాడీగార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 78 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమృత్ పాల్ సింగ్ ఆర్థిక వ్యవహారాలు చూసే దల్జీత్ సింగ్ కూడా ఇందులో ఉన్నారు. అతడిని హర్యానాలోనే గురుగావ్ లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పంజాబ్ మొత్తం హై అలర్ట్ లో ఉంది. జలంధర్‌లో అతని ముగ్గురు సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఏడుగురు బాడీగార్డులను అరెస్ట్ చేశారు. చివరిసారిగా అమృత్ పాల్ సింగ్ ను జలంధర్ లో బైకు వెళ్లుతున్నట్లు చూశారు.

ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి తర్వాత అతడిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే జీ20 సమావేశాలు అయ్యే వరకు ఓపిక పట్టి తర్వాతి రోజే భారీ ఆపరేషన్ ప్రారంభించింది. అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు లవ్ ప్రీత్ సింగ్ అరెస్ట్ తర్వాత అతడిని విడిపించేందుకు పెద్ద ఎత్తు అమృత్ పాల్ సింగ్ తన మద్దతుదారులతో పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు పలువురు పోలీసులపై దాడి చేశారు.

Show comments