NTV Telugu Site icon

Chhattisgarh: బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వారి ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా ధళాలు జల్లెడ పడుతూ మావోయిస్టులను ఏరివేస్తున్నారు.