Site icon NTV Telugu

Karnataka Ambulance Crash: ఘోర అంబులెన్స్ ప్రమాదం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్

Ambulance Crash

Ambulance Crash

Karnataka Ambulance Crash: కర్ణాటకలో ఓ అంబులెన్స్‌ బీభత్సం సృష్టించింది. ఉడుపి జిల్లాలో ఘోర అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం కుందాపూర్ తాలూకా ప్రాంతంలోని టోల్ ప్లాజా వద్ద వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్.. టోల్ కౌంటర్‌ను బలంగా ఢీ కొట్టింది. కుందాపురం నుంచి రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అప్పటికే వర్షం పడుతుండటంతో టోల్‌ గేట్‌ వద్ద సిబ్బంది బారికేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే ఇంతలో అంబులెన్స్‌ అటుగా రావడాన్ని గమనించిన సిబ్బంది టోల్‌ ప్లాజా ముందు ఉన్న రెండు బారికేడ్లను వేగంగా తొలగించారు. అప్పటికే అతివేగంతో వస్తున్న అంబులెన్స్ వర్షపునీరు కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. అంబులెన్స్‌లోని పరికరాలన్ని చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.

Drunk And Driving: పాతబస్తీలో మందు బాబు హల్చల్.. పోలీసుల ముందే ప్యాంట్‌ విప్పి మరీ..

ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఒక రోగి, ఇద్దరు సహాయకులతో పాటు రోడ్డుపై ఉన్న టోల్‌గేట్‌ సిబ్బంది మరణించారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ మాత్రం గాయాలతో బయటపడగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ప్రమాద తీవ్రత కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది.

Exit mobile version