Marriage cheater arrested in Tamil Nadu:ప్రస్తుత కాలంలో అమ్మాయిల అంచానాలను అందుకుంటేనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చాలా మంది యువకుల వయస్సు 35-40 ఏళ్లకు చేరుకున్నా వివాహాలు కావడం లేదు. ఇదో కోణం అయితే కొంత మంది అమ్మాయిలు మాత్రం బెస్ట్ కావాలంటూ.. మోసగాళ్ల చేతుల్లో పడుతున్నారు. వారిని పెళ్లి చేసుకున్న తర్వాత కానీ తెలియడం లేదు అసలు బాగోతం. ఉద్యోగం ఉందని నమ్మించి యువతులను బుట్టలో వేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
Read Also: Covid BF.7 Variant: భారతీయుల్ని ఏ వేరియంట్ ఏం చేయలేదు.. బీఎఫ్-7 మన ముందు జుజుబీ..ఎందుకంటే..?
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 సార్లు పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు పోలీసులకు చిక్కాడు. కేవలం 26 ఏళ్ల వయసు ఉన్న కార్తిక్ రాజా అనే యువకుడు నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తి 21 మంది అమ్మాయిలను మోసం చేశాడు. చివరకు ఓ యువతి ఫిర్యాదుతో అతని పెళ్లిళ్ల కథలు బయటకు వచ్చాయి. తమిళనాడు తంజావూర్ జిల్లా రామనపూడికి చెందిన కార్తిక్ రాజాకు 21 వివాహాలు పజరిగాయి. ఈ ఏడాది మార్చి నెలలో రాణి అనే యువతిని 21వ పెళ్లి చేసుకున్నాడు. కట్నంగా ఐదెకరాల భూమి, లక్షన్నర నగదు, బంగారం ఇచ్చారు. అయితే వీటన్నింటితో సొమ్ము చేసుకుని ఉడాయించాడు కార్తిక్ రాజా. దీంతో భార్య రాణి, భర్త కార్తిక్ ఆచూకీపై ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో కార్తిక్ రాజా ఆచూకీ కనుక్కున్నారు పోలీసులు. పోలీసులు విచారణలో విస్తూ పోయే విషయాలు వెల్లడించాడు కార్తిక్ రాజా. తనకు ఇప్పటి వరకు 21 పెళ్లిళ్లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కార్తిక్ రాజా ఎలా 21 పెళ్లిళ్లు చేసుకున్నాడనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
కార్తీక్ రాజా వివిధ ఉద్యోగాలు చేస్తున్నట్లు నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో ఒక్కో అమ్మాయిని ఒక్కో పేరుతో పరిచయం చేశాడు. కార్తీక్ రాజా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వరసగా వివాహాలు చేసుకునే వాడు. ఒక్క భార్యతో కనీసం 5 నెలలు కూడా ఉండేవాడు కాదని తెలిసింది. ఓ పెళ్లి జరిగిన తర్వాత మరో ఊరికి వెళ్లి వేరే యువతిని పెళ్లి చేసుకునే వాడని పోలీసులు గుర్తించారు. కార్తిక్ రాజా భార్యలు తమిళనాడులోని 13 జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నిత్య పెళ్లికొడుకు కార్తిక్ రాజా వద్ద ఆడి కారు ఉందని.. బంగారం, నగదు లేదని గుర్తించారు. బంగారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
