Marco Rubio: భార్యతో కలిసి తాజ్‌మహల్, జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో
- భారత్‌లో కొనసాగుతోన్న మార్కో రూబియో పర్యటన
- సోమవారం ఉదయం తాజ్‌మహల్ సందర్శన
- అనంతరం జైపూర్‌లో ప్రసిద్ధ కట్టడాలు పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటన కోసం శనివారం కోల్‌కతాకు వచ్చారు. ఛారిటీ ఆఫ్ మిషనరీస్‌ను సందర్శించిన అనంతరం ఢిల్లీకి చేరుకుని ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కూడా సమావేశం అయ్యారు.

Also Read
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ఇక సోమవారం భారతదేశంలోని చారిత్రాత్మక కట్టడాల సందర్శనకు వెళ్లారు. ఈ ఉదయం ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ను సందర్శించారు. దాదాపు గంటన్నర పాటు గడిపారు. అనంతరం దంపతులు సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా తాజ్‌మహల్‌ను ప్రపంచంలోని నిజమైన అద్భుత సంపదల్లో ఒకటిగా అభివర్ణించారు. అలాగే భారత్‌లో అమెరికా రాయబారి అయిన సెర్గియా గోర్ కూడా భారతదేశపు అద్భుత వారసత్వం,. శిల్పకళకు ప్రతీకగా తాజ్‌మహల్‌ను కొనియాడారు. మార్కో రూబియోతోనే సెర్గియా గోర్ కలియ తిరిగారు.
అనంతరం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రసిద్ధ కట్టడాలను భార్య జీనెట్ రూబియోతో కలిసి సందర్శించారు. ఆమేర్ కోటలో కలియ తిరిగారు. అంతక ముందు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దివ్య కుమారి స్వాగతం పలికారు. కట్టడాల గురించి గైడ్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతా పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.
ఇదిలా ఉంటే గతంలో పలువురు అమెరికా ప్రముఖులు కూడా తాజ్‌మహల్‌ను సందర్శించారు. గత ఏడాది అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించగా.. ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి పర్యటించి భారతీయ సంస్కృతికి ఇది చిరస్థాయి చిహ్నమని పేర్కొన్నారు. అలాగే జేడీ వాన్స్ కుటుంబం కూడా తాజ్‌మహల్ అద్భుత కట్టడం అని అభివర్ణించారు.
Rajasthan: US Secretary of State, Marco Rubio, along with his wife, Jeanette D. Rubio, visits Amber Fort in Jaipur
US Ambassador to India Sergio Gor is also present. pic.twitter.com/lVFqgT4PNX
— ANI (@ANI) May 25, 2026
#WATCH | Uttar Pradesh: US Secretary of State, Marco Rubio and his wife Jeanette D. Rubio, at the Taj Mahal in Agra
US Ambassador to India Sergio Gor is also present.
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/XZvdRHfwfY
— ANI (@ANI) May 25, 2026
If Rubio knew the history or architecture, he wouldn't have posed for a picture here. This monument was built out for the love of emperor's Iranian wife, crafted by the genius of Iranian architects — meanwhile his government today threatens to wipe out Iranian civilization,… pic.twitter.com/zi4CNU3u7U
— Iran In Hyderabad (@IraninHyderabad) May 25, 2026
తాజావార్తలు
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!