Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..

  • భారత్‌కు మద్దతుగా UNపై మార్కో రూబియో సెటైర్లు..
  • భారత్‌పై విమర్శలు గుప్పించిన ఐరాస నిపుణులు..
  • వారు నిపుణులు కాదు, విభిన్న అభిప్రాయాలు కలిగిన వారన్న రూబియో..
  • భారత అంతర్గత విషయాల్లో యూఎస్ జోక్యం ఉండదని స్పష్టం..
Marco Rubio

Marco Rubio

Marco Rubio: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనపై భారత ప్రభుత్వం అణగదొక్కుతోందని ఐక్యరాజ్యసమితి(UN) నిపుణులు చేసిన వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. వారు ‘‘ఐక్యరాజ్య సమితి నిపుణులు’’ కాదని, విరుద్ధ అభిప్రాయాలు ఉన్న వ్యక్తులని కొట్టిపారేశారు. ప్రజా నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు.  భారత్‌లో ఇటీవల నిరసనల్ని నియంత్రణపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని 20 మందికి పైగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల నిపుణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రూబియో కామెంట్స్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

అమెరికా, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని రూబియో స్పష్టం చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందని, ఎన్నికలు జరుగుతాయని, కాబట్టి తాను దేశీయ రాజకీయ విషయాలపై నా అభిప్రాయాన్ని చెప్పను అని అన్నారు. శాంతియుత నిరసనలు, హింసాత్మక నిరసనలకు మధ్య తేడా ఉందని రూబియో అన్నారు. యూరప్‌లో హింసాత్మక సంఘటనలను ఉదాహరణగా చెప్పారు. ఇదే సమయంలో అమెరికాలో ప్రతీరోజు నిరసనలు జరుగుతాయనే విషయాన్ని వెల్లడించారు.