Site icon NTV Telugu

Devendra Fadnavis: “మరాఠీ” తప్పనిసరి.. హిందీ వివాదంపై సీఎం ఫడ్నవీస్..

Devendrafadnavis

Devendrafadnavis

Devendra Fadnavis: మహారాష్ట్రలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) విధానంలో భాగంగా హిందీని బలవంతం చేస్తున్నారంటూ శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ రాజ్ ఠాక్రేలు మహరాష్ట్రలో వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వివాదంపై శనివారం క్లారిటీ ఇచ్చారు. మరాఠీ అనేది చర్చనీయాంశమే కాదని, అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. వేరే భాషలు నేర్చుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని చెప్పారు.

Read Also: Wife harassment: యోగి జీ ఇలాంటి వారిని అరికట్టండి.. భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య..

హిందీ పట్ల వ్యతిరేకత, ఇంగ్లీష్ పట్ల పెరుగుతున్న ప్రాధాన్యతనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మరాఠీకి ఎలాంటి సవాలు వచ్చిన సహించబోమని హెచ్చరించారు. ‘‘మహారాష్ట్రలో మరాఠీ భాష తప్పనిసరి, ప్రతి ఒక్కరూ దానిని నేర్చుకోవాలి. అదనంగా, మీరు ఇతర భాషలను నేర్చుకోవాలనుకుంటే, మీరు అలా చేయవచ్చు. హిందీ పట్ల వ్యతిరేకత, ఇంగ్లీష్‌కి సపోర్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా మరాఠీని వ్యతిరేకిస్తే, దానిని సహించబోము’’ అని ఫడ్నవీస్ అన్నారు.

జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర బోర్డు పాఠశాలల్లో మరాఠీ , ఇంగ్లీషుతో పాటు 1వ తరగతి నుండి మూడవ భాషగా హిందీ బోధనను తప్పనిసరి చేసింది. ఈ చర్య కేవలం విద్యా ప్రయోజనాల కోసమే అని, ఏ రాజకీయ లేదా సమాజ ఎజెండా లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

Exit mobile version