Site icon NTV Telugu

Maoists Arrest: గడ్చిరోలిలో నలుగురు మావోయిస్టుల అరెస్ట్

ఈమధ్యకాలంలో మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. అక్కడక్కడా వివిధ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో గ్రేహౌండ్స్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. కూంబింగ్ లు పెంచారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నలుగురు మావోయిస్ట్ లు అరెస్టయ్యారు. గడ్చిరోలి జిల్లాలో టాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయింగ్ పోలీసులు నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు.

ధోడ్ రాజ్ పరిడాని నెలగుండ అడవిలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా పోలీసులు ఈ అరెస్ట్ లు చేశారు. సీపీఐ మావోయిస్ట్ గ్రూప్ కి చెందిన నక్సల్స్ నెలగొండ గ్రామ పరిధిలో సంచరిస్తుండగా గుర్తించారు. పట్టుబడిన వారిలో బాపు @రామాజీ దొఘే, మరోటి @అంతురాం, సుమన్ @జన్ని కోమటి కుడ్యమి, అజిత్@ భరత్ మైన హిచామి ఉన్నారు. వీరిపై మొత్తం రూ.18 లక్షల రివార్డ్ ఉన్నట్లు గా పోలీసులు తెలిపారు. ఈ నలుగురి మావోయిస్టులపై పలు దోపిడీలు, హత్యలు, ఎన్ కౌంటర్ లు వంటి కేసులు నమోదులో ఉన్నాయి.

Read Also: Pudding and Mink Drugs Case: పబ్ డ్రగ్స్ కేసులో పోలీసుల దూకుడు

Exit mobile version