PAK Youtubers: అదృశ్యమైన “పాక్ యూట్యూబర్లు”.. భారత్‌ని ప్రశంసించడం పాక్ ఆర్మీకి నచ్చలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK Youtubers: పాకిస్తాన్ ప్రభుత్వం, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడి యూట్యూబర్లను అణిచివేస్తోంది. ముఖ్యంగా భారత అభివృద్ధి, భారత విషయాలను కంటెంట్ కింద వాడుతూ, నిజాలను నిర్భయంగా చెబుతున్న ఇద్దరు ప్రముఖ యూట్యూబర్లు గత వారం నుంచి కనిపించకుండా పోయారు. సనా అమ్జద్, షోయబ్ చౌదరి అనే ఇద్దరు యూట్యూబర్లు భారత్‌లో కూడా చాలా ఫేమస్. తరుచుగా భారత్‌ని పాకిస్తాన్‌తో పోలుస్తూ అక్కడి ప్రజలకు అసలు నిజాలు చెబుతుంటారు. వీరిద్దరికి మిలియన్లలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మన దేశం నుంచి కూడా లక్షలాది మంది వీరిని ఫాలో అవుతున్నారు.
Read Also: Saif Ali Khan: ‘‘మరో 2 మి.మీ. కత్తి లోతుగా దిగి ఉంటే..’’ సైఫ్ పరిస్థితిపై డాక్టర్లు..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
అయితే, ఇప్పుడు భారత్‌లోని వాస్తవాలు చూపించడం పాకిస్తాన్ సైన్యానికి సమస్యగా మారింది. వీరిద్దరి వీడియోలు పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా మిలియన్ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రాపగండాపై నిజానిజాలు చెబుతున్నారు. భారత్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది, భారత అభివృద్ధి ఎలా ఉంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి..?, కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ అమలు చేస్తుంది, పీఓకేలో ప్రజల పరిస్థితుల వంటి వీడియోలు చేస్తూ అక్కడి ప్రజలకు నిజాలను చెబుతున్నారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట పెరగడం, పాకిస్తాన్‌ని ఎవరు పట్టించుకోకపోవడానికి కారణాలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకునే కంటెంట్‌ని చేస్తుంటారు. పాకిస్తాన్ వెనకబడి ఉండటానికి కారణాలు, పాక్ సైన్యం తీరుపై విమర్శలు గుప్పిస్తూ వీడియోలు చేశారు.
గత కొంత కాలంగా వీరిద్దరితో పాటు పలువురు యూట్యూబర్లు ఆ దేశంలో అణిచివేత, బెదిరింపులకు గురవుతున్నారు. సనా అమ్జాద్, షోయబ్ చౌదరితో పాటు దాదాపుగా 12 మంది యూట్యూబర్లు కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. ప్రతీ రోజు వీరు చేసే కంటెంట్ వారి యూట్యూబ్ ఛానెళ్లలో వస్తుంటుంది. కానీ కొన్ని రోజులుగా వీరి కనిపించకుండా పోవడంతో పాటు, ఎలాంటి కంటెంట్ కూడా వారి ఛానెళ్లలో పోస్ట్ కాలేదు. వీరి ఛానెళ్లలోని కొన్ని వీడియోలు కూడా డిలీట్ అయ్యాయి. సైన్యం వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వీరిద్దరికి మరణ శిక్ష విధించిందనే ఊహాగానాలు అటు పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!